Breaking News

ఇండియాకు హార్లీ డేవిడ్‌సన్ గుడ్ బై

24 th Sep 2020, UTC
ఇండియాకు హార్లీ డేవిడ్‌సన్  గుడ్ బై

అమెరికాకు చెందిన దిగ్గజ టూవీలర్ కంపెనీ హార్లీ డేవిడ్‌సన్ భారత్‌లో కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమ్మకాలు, తయారీ సర్వీసులు బంద్ చేస్తున్నట్లు పేర్కొంది.అధిక లాభదాయకత కలిగిన మోటార్‌సైకిల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, అలాగే అమెరికా మార్కెట్‌‌పైనే పూర్తిగా దృష్టి సారిస్తామని ప్రకటించింది. అందులో బాగంగా కంపెనీ భారత కార్యకలాపాలకు గుడ్ బై చెప్పింది.

2020లో కంపెనీ రిస్ట్రక్చరింగ్ కాస్ట్ దాదాపు 169 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని హార్లీ డేవిడ్‌సన్ పేర్కొంటోంది. దేశంలో 70 మంది ఉద్యోగుల తొగింపు కూడా ఇందులో భాగంగానే చెప్పుకొచ్చింది. కంపెనీ అంతర్జాతీయ విక్రయాల్లో భారత్‌ నుంచి వాటా 5 శాతం దిగువునే ఉందని కంపెనీ తెలిపింది. అందుకే కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించింది.ఇకపోతే హార్లీ డేవిడ్‌సన్ భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోవడం లేదంటే భారత్‌లో కార్యకలాపాలను మూసివేయడం కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో భారత్ హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ దిగుమతులపై అధిక సుంకం విధిస్తోందని అన్న విషయం తెలిసిందే.  మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox