Breaking News

గ్రేటర్ ఎన్నికలు..పవన్ తో బీజేపీ నేతల భేటీ..!

20 th Nov 2020, UTC

ప్రస్తుతం తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం తో తెరాస షాకైంది. ఈ నేపధ్యంలో జీహెచ్ఎంసి ఎన్నికల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంది. మరో వైపు, జనసేన, టీడీపీ లు కూడా తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. అయితే, పొత్తు విషయం లో మాత్రం జనసేన, బీజేపీ లు భిన్న వాదనలను వినిపిస్తున్నాయి. పొత్తు ఉంటుంది అని జనసేన ప్రకటించగా, బీజేపీ మాత్రం అలాంటిదేమి లేదని, పొత్తు విషయమై ఎవరు సంప్రదించలేదని తేల్చి చెప్పేసింది.

తాజాగా, ఈరోజు బీజేపీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు జనసేన అభ్యర్థులను ప్రకటించలేదు.మరో వైపు నామినేషన్లకు గడువు ముగుస్తున్న సమయంలో బీజేపీ నేతలతో పవన్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయం లో వీరు భేటీ అవడం తో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ నివాసంలో వీరు చర్చలు జరుపుకుంటున్నారు. ఈ సమావేశంలో పొత్తు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox