Breaking News

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై కేసు పెట్టిన ఈడీ ..!

02 nd Jul 2020, UTC

                టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ కు సమన్లు ఇచ్చేందుకు ఈడీ  సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గతం లో పద్దెనిమిది కోట్లు కుంభకోణం జరిగింది అనే ఆరోపణలతో.. రవి ప్రకాష్ తో సహా మరో ఇద్దరి పై ఫిర్యాదు నమోదు అయింది.. అయితే.. వీరిపై.. 2019 అక్టోబర్ లో కేసు నమోదైంది.. తాజాగా... ఈ విషయమై వీరిపై ఈడీ  కేసు నమోదు చేసింది. వీరికి విచారణ నిమిత్తం సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 
 
               రవిప్రకాష్‌తో పాటూ మరో ఇద్దరు కలిసి అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా తీశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)  ప్రస్తుతం సమన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ABCPL డైరెక్టర్ గొట్టిపాటి సింగారావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం తో.. రవి ప్రకాష్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు.  
 
                  ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో అలంద మీడియా టీవీ9లో మెజార్టీ షేర్లను కొనుగోలు చేసింది. అయితే.. ఈ అకౌంట్ లను పరిశీలిస్తున్న టైం లో ఈ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే.. ఈ డబ్బులను డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత బెయిల్ లభించడం తో.. రవి ప్రకాష్ విడుదల అయ్యారు. తన పై వచ్చిన ఆరోపణల విషయమై కూడా వివరణ ఇచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox