వరుస భూకంపాలతో ఉత్తర భారతం ఉలిక్కిపడుతోంది. ఏప్రిల్ నుంచి ఢిల్లీ ని వరుస భూకంపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా....ఆదివారం..సోమవారం... కూడా ఢిల్లీ లో భూకంపం సంభవించింది. హర్యానా లో కూడా భూమి కంపించడం తో అక్కడివారు భయబ్రాంతుళ్లయ్యారు. ప్రస్తుతం జమ్మూకాశ్మిర్ లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఢిల్లీ పైనా పడి...అక్కడ కూడా స్వల్పం గా భూమి కంపించింది.
మంగళవారం ఉదయం 8 గంటల 16 నిమిషాలకు జమ్ము కాశ్మిర్ లో భూకంపం వచ్చింది. అయితే... రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం తీవ్రత 3.9గా నమోదయ్యిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ జమ్మూ కాశ్మిర్ కు రాజధాని శ్రీనగర్. ఈ శ్రీనగర్ కు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం అధికారులు గుర్తించారు. హఠాత్తుగా భూమి కంపించడం తో అక్కడి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
సోమవారం మధ్యాహ్నం హర్యానాలోని గుర్గావ్లో ను భూకంపం వెలుగు చూసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.1గా నమోదయ్యింది. దీనిప్రభావంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఢిల్లీ లో ఆదివారం వచ్చిన భూకంప తీవ్రత 1.3గా ఉంది. భూకంప కేంద్ర హర్యానాలోని రోహ్తక్ జిల్లా కేంద్రానికి 23 కి.మీ. దూరంలో ఉన్నదని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.