Breaking News

డీకే అరుణ అరెస్ట్..!

17 th Oct 2020, UTC
డీకే అరుణ అరెస్ట్..!

డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను పరిశీలించడం కోసం డీకే అరుణ ఈరోజు వనపర్తి జిల్లా కల్వకుర్తి వద్దకు వెళ్లారు. అక్కడ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. ఐతే ఆమెను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో పోలీసులు కొందరు బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి,  ఏఐ సీసీ కార్యదర్శి సంపత్, మాజీ ఎంపీ మల్లు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కి తరలించారని సమాచారం. మరో వైపు ఈ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox