Breaking News

కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దినేష్ కార్తీక్ 

16 th Oct 2020, UTC

అబుదాబి :ఐపీఎల్‌లో తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శల నేపధ్యంలో తాను కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు  దినేష్ కార్తీక్  ప్రకటించాడు. ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బ్యాటింగ్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్న దృష్టితో సార‌థ్యాన్ని వ‌ద‌లుకుంటున్న‌ట్లు దినేశ్ వెల్ల‌డించాడు. ఇక నుంచి ఆ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకుంటాడు. ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, నరైన్‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో ఫ్యాన్స్ కార్తీక్‌ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంగ్లండ్‌కు వరల్డ్‌ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్‌ కార్తీక్‌ లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. తనకు తానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని, కానీ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox