Breaking News

దీపక్ చహర్ సూపర్ ఇన్నింగ్స్.. రెండో వన్డేలో భారత్‌ ఘనవిజయం

21 st Jul 2021, UTC

కొలంబో :మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. దీనితో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50), కరుణరత్నే ( 44 నాటౌట్‌) ధాటిగా ఆడటంతో  శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చహల్‌ 3, భువనేశ్వర్‌ 3, దీపక్‌ చహర్‌ 2 వికెట్లు తీసారు.

భారత్ బ్యాట్స్ మెన్  పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1), శిఖర్‌ ధావన్‌ (29)త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో మనీష్ పాండే, సూర్యకుమార్‌ బాధ్యతగా ఆడటం ప్రారంభించారు. అయితే షనక బౌలింగ్‌లో సూర్యకుమార్‌ స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఆడగా బంతి బౌలర్‌ చేతిని తాకుతూ నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లోని వికెట్లను పడగట్టింది. అదే సమయంలో పరుగు కోసం పాండే క్రీజును వదిలి ముందుకు రావడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో హార్దిక్‌ (0) కూడా అవుటవ్వడంతో భారత్‌  కష్టాల్లో పడింది. తరువాత సూర్య కుమార్ ,కృనాల్‌ అవుటయ్యారు. 

అయితే ఎనిమిదో నంబర్‌లో వచ్చిన దీపక్‌ చహర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసాడు. భువనేశ్వర్‌ (19 నాటౌట్‌; ) సాయంతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 8వ వికెట్‌కు భువనేశ్వర్‌తో కలిసి దీపక్‌ 84 పరుగులు జోడించాడు. దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ తో భారత జట్టు విజయం సాధించింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox