Breaking News

అండర్ వరల్డ్ డాన్ దావుద్ కు కరోనా..!

05 th Jun 2020, UTC
అండర్ వరల్డ్ డాన్ దావుద్ కు కరోనా..!

అండర్ వరల్డ్ డాన్ దావుద్ కు , ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పాకిస్తాన్ మీడియా లో ప్రచారం సాగుతోంది. దావూద్ కి కరోనా పాజిటివ్ రావడం తో.. అతని వ్యక్తిగత సిబ్బంది కి మరియు కాపలాదారులను క్వారెంటైన్ చేశారు. దావుద్ ముంబైలోని డోంగ్రీలో జన్మించిన సంగతి తెలిసిందే..  ప్రస్తుతం ఇతను కరాచీలో నివసిస్తున్నట్లు చెబుతుంటారు. ఈ విషయం మీద ఎటువంటి అధికారిక కన్ఫర్మేషన్ లేకున్నా ఆయన పాకిస్తాన్ ప్రభుత్వ అండతో అక్కడ ఉంటున్నట్టు చెబుతారు. ఈయన భారతదేశ యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లలో ఒకరు. దావూద్ 1993 బాంబే పేలుళ్లలో ముఖ్య సూత్రధారి, ఈయన మీద ఇప్పటికే పలు ఇంటర్‌పోల్ నోటీసులు ఉన్నాయి. డి-కంపెనీ బాస్ ప్రస్తుతం కరాచీ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. దావూద్ ఇబ్రహీం భార్య మెహజాబిన్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. మే 2003 నుంచి దావుద్ ను యునైటెడ్ స్టేట్స్ మరియు ఇండియా.. గ్లోబల్ టెర్రరిస్ట్  గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox