Breaking News

 పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

16 th Apr 2021, UTC
 పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్నారు.ఈ నెల 3న తిరుపతి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ హైదరాబాద్ కు చేరుకున్న తరువాత నలతగా వుండటంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో నెగటివ్ వచ్చింది. అయితే వైద్యుల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్ కు వెళ్లారు.

అయితే కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నెప్పులు రావడంతో రెండు రోజుల కిందట మరలా కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు, కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెళ్ల సుమన్ హైదారాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ కు చికిత్స ప్రారంభించారు. చిరంజీవి, శ్రీమతి సురేఖ, రామ్ చరణ్, శ్రీమతి ఉపాసన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అసోలో నుంచి వచ్చిన వైద్యబృందం పవన్ కళ్యాణ్ ను పరీక్షించింది. ఊపరితితిత్లుల్లో నిమ్ము చేరడంతో యాంటి వైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. ఆక్సిజన్ కూడ ఇస్తున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే వుందని త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox