Breaking News

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్..!

20 th Nov 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :నేటినుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. పన్నెండు రాశుల్లో బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినపుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా ప్రతి నదికి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. నేడు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించడంతో తుంగభద్రనదికి పుష్కరాలు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.21 గంటల సమయంలో గురువు మకర రాశిలోకి ప్రవేశించాక పుష్కరాలను ప్రారంభించారు. తుంగభద్రనదికి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

తుంగభద్రమ్మకు సారె, చీర సమర్పించారు. పుష్కరాల సందర్భంగా ఈ ఘాట్ లో పన్నెండు రోజుల పాటు ప్రత్యేక హోమాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్ కు చేరుకున్నారు. కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లోనూ, అనంతరం కారులో తుంగభద్ర నదికి చేరుకున్నారు. సీఎంకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. 

మరో వైపు, తెలంగాణలో కూడా అలంపూర్ వద్ద తుంగభద్రమ్మ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ఈ పుష్కరాలను ప్రారంభించారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చి పన్నెండు రోజుల పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. అయితే, ఈ ఏడాది కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. 

తుంగభద్రా నది కృష్ణ నదికి ముఖ్య ఉపనది. రామాయణ కాలం నుంచే ఈ నది ఉన్నది. ఆకాలంలో ఈ నదిని పంపా నదిగా పిలిచేవారట. తుంగ, భద్ర అనే రెండు నదుల కలయికతో తుంగభద్రా నది ఏర్పడింది. వాస్తవానికి ఈ రెండు నదులు కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వత శ్రేణుల్లో గంగమూల అనే ప్రదేశంలో ఆవిర్భవించాయి. అక్కడ నుంచి సుమారు 147 కిలోమీటర్ల దూరం వరకు ఈ రెండు వేరు వేరుగానే ప్రవహిస్తాయి. కర్ణాటకలోని కూడ్లీ వద్ద  ఈ రెండు కలిసిపోతాయి. అందుకే ఈ నదిని తుంగభద్రగా వ్యవహరిస్తారు. అక్కడనుంచి శృంగేరి, హంపి మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేళిగనూరులో ప్రవహిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లోకి వస్తుంది. తర్వాత అలంపూర్‌, కర్నూలు నగరం మీదుగా ప్రవహిస్తూ సంగమేశ్వరం వద్ద కృష్ణ నదిలో కలుస్తుంది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox