Breaking News

ఏపీ కి వెళ్లకుండానే చిరు కు షాక్..!

09 th Jun 2020, UTC
ఏపీ కి వెళ్లకుండానే చిరు కు షాక్..!
కరోనా మహమ్మారి నేపధ్యం లో టాలీవుడ్ కి చెందిన సినీపెద్దలు జగన్ ను కలవనున్న సంగతి తెల్సిందే. రంజీవితో పాటు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, జీవిత, నిర్మాత సి.కళ్యాణ్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి సిద్ధం అయ్యారు. అయితే.. వీరికి ఏపీ కి వెళ్లకుండానే అడ్డంకి వచ్చింది.
 
           తెలంగాణ లో చిరు నివాసం లో జరిగిన భేటీ లో బాలయ్య తో సహా చాల మంది పెద్దలకు ఈ విషయం గురించి తెలియదని..వారెవరికీ ఆహ్వానం ఇవ్వలేదన్న విషయమై వివాదం చెలరేగిన నేపధ్యం లో చిరంజీవి ఈసారి పలువురిని తన టీం లో కలుపుకుని వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. అయితే ముఖ్యమంత్రిని కలిసే టీమ్ లో 25 మంది సభ్యులను తీసుకు వెళ్ళాలి అని చిరంజీవి భావించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల టీమ్ లో చిరంజీవి నాగార్జున శ్యామ్ ప్రసాద్ రెడ్డి జెమిని కిరణ్ రాజమౌళి త్రివిక్రమ్ సురేశ్ బాబు లతో పాటు ఎవరు ఊహించని విధంగా జీవితకు కూడ స్థానం లభించడంతో చిరంజీవి తాను అందరివాడిని అని తెలుపుకునే ముద్ర కోసం తాపత్రయ పడుతున్నట్లు  పలువురు భావిస్తున్నారు. ఈ నేపధ్యం లో ప్రభుత్వ అధికారులు ముగ్గురి నుంచి ఐదుగురి కంటే ఎక్కువ మంది ని అనుమతించే పరిస్థితి లేదని చెప్పడం తో.. చిరు టీం ఆలోచనలో పడింది. 
 
           అయితే.. చిరంజీవి అతి కష్టంమీద ఆ సంఖ్యను 8 మందికి పెంచే విషయంలో ప్రభుత్వ అనుమతులు తీసుకోవడానికి చాల కష్టపడవలసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. జగన్ తో సినీ పెద్దలు జరిపే ఈ సమావేశం లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ డోర్ లో జరిగే షూటింగ్ ల నిమిత్తం వసూలు చేసే ఫీజును రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా విశాఖపట్నంలో ఫిలిం ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అన్న విషయమై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవి తో పాటు ఇతర ప్రముఖులు కూడా సీఎం జగన్ ను కలుద్దామని భావించడం తో.. ప్రస్తుతం దీనికి అధికారులు బ్రేక్ వేయడం తో వారంతా నిరాశ పడ్డారని తెలుస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox