Breaking News

చర్చకు చైనా సిద్ధం..!

03 rd Jun 2020, UTC
చర్చకు చైనా సిద్ధం..!

లడఖ్‌లోని సరిహద్దుల వద్ద చైనా తన బలగాలను మోహరించడం తో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. అందుకు ధీటుగా భారత్ గా తన బలగాలను మోహరించింది. గత ఇరవై రోజులగా కవ్వింపు చర్యలతో విసిగిస్తున్న చైనా... ఉద్రిక్తతల మధ్య చర్చకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామని ఇరు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ మేరకు ఈ నెల 6న ఇరు దేశాల అగ్రశ్రేణి‌ కమాండర్లు చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కూడా‌  స్పష్టం చేసారు. ఓ వైపు లడఖ్ లో చైనా సైన్యాలు చొచ్చుకురావడం తో.... భారత్ కూడా ధీటుగానే జవాబిచ్చింది. చైనా సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే. మరో వైపు భారత్ కూడా అక్కడ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ సైనికులు వెంటనే వెళ్లేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటోంది. తాము ఈ పనులను ఆపబోమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox