Breaking News

పార్లమెంట్ భవనం కూల్చేసి కొత్తది కడతాం...!

29 th Jul 2020, UTC

ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. 
 
అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది
 
'1921లో చేప‌ట్టిన పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం 1937లో పూర్తైంది. ఇప్ప‌టికే వందేళ్లు గ‌డిచిపోయాయి. కాల‌క్ర‌మేణా పార్ల‌మెంట‌రీ కార్య‌క‌లాపాలు కూడా పెరిగాయి. అందువ‌ల్ల ప్ర‌స్తుత పార్ల‌మెంట్ భ‌వ‌నం సౌక‌ర్యాలు, సాంకేతిక అవ‌స‌రాలను తీర్చ‌లేక‌పోతుంది. 
 
1956లోనూ రెండు కొత్త అంత‌స్తులు క‌ట్టారు. అయితే అగ్ని మాప‌క నిబంద‌న‌లకు త‌గ్గ‌ట్లు ఏమాత్రం లేదు.  ఈ ప‌రిస్థితుల్లో త‌ప్ప‌నిస‌రిగా భ‌వనాన్ని కూల్చి కొత్త‌ది నిర్మిస్తాం' అంటూ కేంద్రం  విన్న‌వించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox