Breaking News

జీవీకే పై సీబీఐ కేసు..!

03 rd Jul 2020, UTC
జీవీకే  పై సీబీఐ కేసు..!
జీవీకే గ్రూప్‌ నిర్వహణలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)లో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ ద్వారా ఎంఐఏఎల్‌కు చెందిన రూ.705 కోట్ల నిధులను జీవీకే గ్రూప్‌ మళ్లించిందంటూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ గునుపాటి వెంకట కృష్ణా రెడ్డి (జీవీ కృష్ణా రెడి)్డ, ఆయన కుమారుడు, ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ సంజయ్‌ రెడ్డి, భారతీయ విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ (ఏఏఐ) ఉన్నతాధికారులతో సహా మరో తొమ్మిది కంపెనీలపైనా  కేసులు నమోదు చేసింది.

విమానాశ్రయ ఆధునికీకరణ, నిర్వహణ పేరుతో జీవీకే గ్రూప్‌ ఎలా మోసగించిందీ సీబీఐ తన దర్యాప్తులో వెల్లడించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు గాను సీబీఐ ఇప్పటికే ముంబై, హైదరాబాద్‌ల్లోని జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లకు చెందిన ఆరు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపింది. మరోవైపు సీబీఐ కేసు నమోదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
.ఒప్పందంలో భాగంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి కోసం జీవీకే గ్రూప్‌నకు ఏఏఐ 200 ఎకరాల భూమిని అప్పగించింది. ఒప్పందం ప్రకారం జీవీకే గ్రూప్‌ ఈ భూమిని విమానాశ్రయ అభివృద్ధి, ఆదాయ కల్పన కోసం ఉపయోగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా 2017లో జీవీకే గ్రూప్‌ ఈ భూమిని రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కోసమని తొమ్మిది కంపెనీలతో ఒప్పందాల కుదుర్చుకుంది.

అయితే  ఇవన్నీ బోగస్‌ ఒప్పందాలని సీబీఐ ఆరోపణ. ఎలాంటి పనులు జరగకపోయినా, వివిధ పనుల కోసమని జీవీకే గ్రూప్‌ ఈ కంపెనీలకు రూ.310 కోట్లు బదిలీ చేసింది. ఒక్క పనీ చేయకపోయినా ఈ తొమ్మిది కంపెనీలూ నకిలీ బిల్లులు పెట్టి ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాయి.
ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.805 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox