Breaking News

పోలీసుల పైకి కుక్కలను వదిలిన పివిపి..!

29 th Jun 2020, UTC
పోలీసుల పైకి కుక్కలను వదిలిన పివిపి..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత దారుణమైన తప్పిదం చేసారు.. విచారణ కు వచ్చిన పోలీసులపైనే కుక్కలను వదిలారు. దీనితో.. పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోన్నది. ఇటీవల పీవీపీపై నమోదైన ఓ కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది.
          ఊహించని పరిణామం తో.. మొదట భయపడ్డ పోలీసులు అక్కడనుంచి బయటకు పరిగెత్తారు.. కానీ ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పివిపి పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు. గతవారం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  ఇందులో భాగంగానే పోలీసులు పివిపి ఇంటికి వెళ్లారు. పోలీసులు వెళ్లగా ఈ ఘటన జరిగింది. 
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox