Breaking News

ఒంటి కాలుతో స్కూలుకు వెడుతున్న బీహార్ బాలిక.. సాయం చేస్తామంటూ ముందుకు వచ్చిన దాతలు

26 th May 2022, UTC

Bihar: బీహార్‌లో ప్రమాదంలో కాలు కోల్పోయిన 10 ఏళ్ల సీమ అనే చిన్నారి 1 కి.మీ దూరంలో వున్న పాఠశాలకు ఒంటికాలుతో వెడుతున్న వీడియో సోషల్ మీడియాలో రావడంతో ఆమెకు సాయం చేయడానికి పలువురు ముందుకు వచ్చారు.

టెలివిజన్ ఛానెల్ న్యూస్24 ద్వారా షేర్ చేయబడిన క్లిప్ ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన వారిలో నటుడు సోనూసూద్ కూడా ఉన్నారు. టికెట్ పంపుతున్నాను. రెండు కాళ్లతో  నడవాల్సిన సమయం వచ్చింది. అంటూ  సోనూ ట్వీట్ చేసారు. బీహార్ ప్రభుత్వం ఆ చిన్నారికి ట్రైసైకిల్ అందించింది. ఆమెకు త్వరలో కృత్రిమ కాలు వస్తుందని రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి ట్వీట్ చేశారు. మన రాష్ట్రంలోని పిల్లలు చదువుకోవడానికి అన్ని అడ్డంకులను దాటుతున్నందుకు గర్విస్తున్నాం అని అన్నారు. సీమతో పాటు ఆమె లాంటి ప్రతి బిడ్డను గుర్తించి తగిన సహాయం అందజేస్తాం అని అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ చిన్నారి కథ చూసి చలించిపోయానని అన్నారు. దేశంలోని ప్రతి బిడ్డ మంచి విద్యను కోరుకుంటాడు. సీమ వంటి ప్రతి బిడ్డకు ఉత్తమ విద్యను అందించడం ప్రతి నిజమైన దేశభక్తుని లక్ష్యం కావాలి, అదే నిజమైన దేశభక్తి అని  ఆయన అన్నారు. బీహార్‌ జముయి జిల్లాలోని ఆమె స్వగ్రామమైన ఫతేపూర్ గ్రామంలో, సీమ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె టీచర్‌ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. 

సీమ తండ్రి వలస కూలి. తొమ్మిది మంది కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అతనిపై వుంది. సీమ ఇప్పుడు తన వయస్సులో ఉన్న చాలా మంది బాలికలకు రోల్ మోడల్" అని ఫతేపూర్ వాసులు చెబుతున్నారు. సీమ కుటుంబానికి అన్నివిధాల సహకరిస్తామని వారంటున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox