Breaking News

వీడియో వైరల్ అయిందని.. రాజీనామా చేసేసిన విద్యాశాఖామంత్రి..!

20 th Nov 2020, UTC

బీహార్ :ఇటీవల, బీహార్ లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మేవాలాల్ చౌదరి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. మూడు రోజుల క్రితమే, నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా మేవాలాల్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసారు. ఇటీవల బీహార్ లో జరిగిన ఎన్నికల్లో మేవాలాల్ చౌదరి తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆయనకు ప్రభుత్వం విద్యాశాఖను కేటాయించింది. గతంలో ఆయన భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.

యూనివర్సిటీ పరిధిలో నిర్మించిన భవనాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు. లంచాలు తీసుకుని అర్హత లేనివారికి కూడా యూనివర్శిటీలో ప్రొఫెసర్లు, జూనియర్‌ సైంటిస్టులుగా నియామకం చేసారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ లో జరిగిన అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనితో, నితీష్ కుమార్ నేతృత్వం లో జెడియు పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. తిరిగి ఆయన అదే పార్టీ తరపున విద్యాశాఖకు నియామకం కాబడ్డారు. 

అయితే, ఆర్జేడీ నేతలు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గతంలో జాతీయగీతం ఆలపించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఓ పాఠశాలకు హాజరైన మేవాలాల్ చౌదరి జాతీయ గీతాన్ని తప్పుగా ఉచ్చరించారు. ‘పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా’కు బదులుగా ‘పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా’ అని ఉచ్చరించడంతో, ప్రతిపక్షాలు ఆయనను ట్రోల్ చేస్తున్నాయి. జాతీయ గీతం కూడా పాడడం రాని వ్యక్తిని ఎలా విద్యాశాఖకు మంత్రిగా నియమించారన్నారు. ఈ విమర్శలు, ట్రోలింగ్ లు ఎక్కువ అవుతుండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసారు. నవంబర్ 19 గురువారం రాత్రి రాజీనామా చేసారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, తనపై నమోదైన అభియోగాలపై విచారణ జరుగుతోందని, త్వరలోనే కేసుల నుంచి బయటపడతానని చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox