Breaking News

పదిహేను రోజులు బేగం బజార్ బంద్..!

27 th Jun 2020, UTC
పదిహేను రోజులు బేగం బజార్ బంద్..!
ఈ కరోనా మహమ్మారి వచ్చిన అప్పటి నుంచి పరిస్థితులు మరింత అధ్వాన్నం గా మారాయి.. ఊరికే అంటుకోవడం.. అనారోగ్యం కలుగ చేయడం.. చివరికి ప్రాణాల మీదకు కూడా తెస్తుండడం తో ఈ మహమ్మారి ని చూసి హడలిపోతున్నారు. ఈ మహమ్మారి ఎపుడు మానవాళి ని విడిచి పోతుందో.. వాక్సిన్ ఎప్పుడొస్తుందో.. అని అందరు ఎదురుచూస్తున్నారు. 
 
          ఈ మధ్య హైదరాబాద్ లో కూడా కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ని వదిలించలేక చాల మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు ఓకే కానీ సామాజిక దూరం పాటించడం అంటే కొంతకష్టమే.  బయటకి రాక తప్పట్లేదు.. వస్తే ఎవరికీ ఉందొ.. ఎవరికీ లేదో తెలీదు.. ఈ పరిస్థితుల్లో బేగంబజార్.. స్వచ్చందం గా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతోంది. అక్కడి వర్తకులంతా.. కలిసి స్వచ్చందం గా ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ వాసులు స్వచ్ఛందంగా దుకాణాలు 15 రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క హైదరాబాదులోనే 774 కేసులు రావడం వారిని మరింత భయాందోళనకు గురిచేసింది. లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా 15 రోజులు బంద్ పాటిస్తున్నారు. అలాగే ఆదివారం నుంచి జూలై 5 వరకు బేగంబజార్ మూసివేస్తున్నట్లు అక్కడి వ్యాపారులు ప్రకటించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox