Breaking News

ఆలయాల భద్రతా ప్రమాణాలపై స్పష్టత ఇచ్చిన ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్..!

13 th Jan 2021, UTC

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అని ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అని ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్ పేర్కొన్నారు.

ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్నా భద్రతా ప్రమాణాలను  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయి. అని ఆయన అన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలు పరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో  గత సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశాము. అంతేకాకుండా  43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు, నిరంతర నిఘా తో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నాం అని తెలిపారు.

ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతో పాటు  80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను/ ముఠాలను అరెస్ట్ చేయడం జరిగింది అని ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్ పేర్కొన్నారు. గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది  నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది అని సవాంగ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాము, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తాము అని పేర్కొన్నారు.

కొంతమంది పనిగట్టుకొని  ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం,  ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నాం అని గౌతమ్ సవాంగ్ తెలిపారు.  మన రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తులో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం తో పాటు సిట్ ను  ఏర్పాటు చేయడం జరిగింది. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్  ప్రయోగిస్తాం.  రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు  సంబంధించిన 4895 మంది MO అఫెండర్స్ ను ఇప్పటికే గుర్తించాం. వారందరినీ కూడా జియో మ్యాపింగ్ తో అనుసంధానం చేశాం అని ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్ తెలిపారు. వీరిపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్  ను ఓపెన్ చేస్తాం అని పేర్కొన్నారు.  రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఏపీ లో  దేవాలయాలకు/ పవిత్ర స్థలాలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత కల్పిస్తుంది అని హామీ ఇచ్చారు. 

అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు అని అన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు.  రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి ఇది మనందరి బాధ్యత మీ అందరి సహకారంతో మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకుందాం..

ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్ /dail100, దేవాలయాలకు సంభందించి ప్రత్యేకంగా  9392903400 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు  అందుబాటులో ఉంటుంది అంటూ దేవాలయాల భద్రతా పై నెలకొన్న సందేహాలకు ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్ స్పష్టత ఇచ్చారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox