Breaking News

అమలాపురం అల్లర్ల వెనుక అన్యం సాయి ?

25 th May 2022, UTC
అమలాపురం అల్లర్ల వెనుక అన్యం సాయి ?

Andhrapradesh: అమలాపురంలో మంగళవారం జరిగిన విధ్వంసం వెనుక అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అతడిని అమలాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్నటి ఘటనలపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్యం సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా జిల్లాలో జరుగుతున్న ఆందోళనలో అన్యం సాయి కీలక పాత్ర పోషించాడు. ఈనెల 20వ తేదీన జేఏసీ నేతలు అమలాపురం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్యం సాయి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త అని, మంత్రి విశ్వరూప్‌కు అనుచరుడని టీడీపీ అంటోంది. విశ్వరూప్‌కు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇతను ఇచ్చాడు. సజ్జలకు సైతం అన్యం సాయి సన్నిహితుడని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. అయితే అన్యం సాయి జనసేనకు చెందని వ్యక్తని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox