Breaking News

విజయవాడ దుర్గగుడి సోదాలపై ఏసీబీ నివేదిక

05 th Apr 2021, UTC
విజయవాడ దుర్గగుడి సోదాలపై ఏసీబీ నివేదిక

విజయవాడ దుర్గగుడిలో ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జరిపిన సోదాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. ఈవో తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలను బేఖాతరు చేశారని. ఆడిట్ అభ్యంతరాలను లెక్కచేయకుండా ఈవో చెల్లింపులు చేసారని ఏసీబీ పేర్కొంది.

టెండర్లు, కొటేషన్లు, సామగ్రి కొనుగోళ్లకు ఈవో చెల్లింపులు చేశారని నివేదికలో ఏసీపీ వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా కేఎల్‌ టెక్నాలజీస్‌కు శానిటరీ టెండర్లు, తక్కువ ధరకు కోట్ చేసిన స్పార్క్‌ కంపెనీని పక్కనబెట్టారని నివేదికలో పేర్కొంది. 

టెండర్లు రద్దు చేయకుండా, ఏ1 కాంట్రాక్టర్‌తో చర్చలు జరపకుండా కేఎల్ టెక్నాలజీస్‌కు ఈవో శానిటరీ టెండర్లు అప్పగించారని ఏసీబీ పేర్కొంది. ఇటీవల ఏసీబీ అధికారులు విజయవాడ కనకదుర్గ ఆలయంలో వరుసగా కొన్నిరోజుల పాటు సోదాలు జరిపారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox