Breaking News

దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన ఎసిబి..!

15 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఎసిబి కేసు నమోదు చేసింది. రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో శ్రీనివాస్ భాగస్వామి అయ్యారన్న కారణంతో ఏసీబీ ఆయనపై కేసుని నమోదు చేసింది. అంతే కాకుండా, భూముల కొనుగోళ్లలో కూడా ఏజీగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు దమ్మాలపాటి శ్రీనివాస్ పై అభియోగం ఉంది.

పదవిని అడ్డుపెట్టుకుని తమ బంధువులకు భూములిప్పించారని దమ్మల పాటి శ్రీనివాస్ పై ఏ సీబీ కేసు నమోదు చేసింది. కాగా, 2015, 2016 సంవత్సరాలలో రాజధానిలో భూములు కొన్నట్లు శ్రీనివాస్ పై  ఏసీబీ అభియోగాలు మోపింది. తన పేరిట, భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ భూముల కొనుగోళ్లు చేసారని ఏసీబీ వెల్లడించింది. అయితే ఈ విషయమై దమ్మాలపాటి శ్రీనివాస్ హై కోర్ట్ ను ఆశ్రయించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హై కోర్ట్ లో  పిటిషన్ దాఖలు చేసారు.

తనపై దర్యాప్తు చేయకుండా, అరెస్ట్ చేయకుండా, నిర్బంధించకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను హై కోర్ట్ ఆదేశించాలని కోరారు. ఏ విచారణ జరిగినా, అది హై కోర్ట్ అధికారుల పర్యవేక్షణలోనే జరగాలని శ్రీనివాస్ పిటిషన్ లో పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు చేయకుండా హై కోర్ట్ పోలీస్ లకు ఆదేశాలివ్వాలని కోరారు. తనను మానసికంగా వేధించినందుకు బెదిరించినందుకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని దమ్మాలపాటి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో శ్రీనివాస్ డిజిపిని, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిని, ఏసీబీ డిజిని, సీఐడీ అదనపు డిజిపిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతే కాదు. సీఎం జగన్, ఇంటెలిజెన్స్ డిఐజి కొల్లి రఘురామారెడ్డిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొనడం గమనార్హం. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox