Breaking News

అమరావతి భూములవ్యవహారంలో సుప్రీమ్ కోర్ట్ కూతుళ్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ..!

15 th Sep 2020, UTC

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే  రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారన్న కారణంతో ఆంధ్ర ప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జెనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు, సుప్రీం కోర్ట్ జడ్జి ఇద్దరు కూతుర్లపైనా ఇతర బంధువుల పైన కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది.
 
అవినీతి, మోసం, నేరపూరిత కుట్ర మరియు ప్రతిపాదిత రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో అక్రమ భూ ఒప్పందాలకు సంబంధించిన నమ్మకాన్ని ఉల్లంఘించడం వంటి వాటిని ఛార్జ్ షీట్ లో కారణాలు గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కోమట్ల శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి ఈ విషయమై కంప్లైంట్ చేయడంతో ఏసీబీ రంగంలోకి దిగి, కేసు నమోదు చేసిందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు పేర్కొన్నారు. ప్రభుత్వ పదవిలో ఉండి, వారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కారణంగా ఏసీబీ అధికారులు వీరిపై కేసు నమోదు చేసారు.
 
ఇల్లీగల్ గా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత సమాచారాన్ని సేకరించి అక్కడి భూములను తక్కువ ధరలకే పొందడం నేరం. అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గత కొంతకాలంగా వైసీపీ ఆరోపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏసీబీ రంగంలోకి దిగి అవినీతిని అంతం చేయడానికి కృషి చేస్తోంది. గుంటూరు డిఎస్పీ టిటివి ప్రతాప్ కుమార్ పిటిషనర్ చేసిన ఆరోపణలపై ప్రాధమిక విచారణ చేయనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox