Breaking News

నా భార్య రోజూ విసిగిస్తోంది...విడాకులు ఇప్పించండి

07 th Jun 2020, UTC

వలస కార్మికులను ఆదుకుంటూ నిజమైన హీరోగా అభినందనలు అందుకుంటున్న బాలీవుడ్‌ నటుడు సోనూసుద్‌కు సోషల్‌ మీడియాలో వింత ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ అసోంకు చెందిన ఓ వ్యక్తి ట్విటర్‌ వేదికగా సోనూసుద్‌ను అభ్యర్థించాడు.

కరోనా కారణంగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. లాక్‌డౌక్‌తో అసోంలో చిక్కుకుని పోయాను. మా సొంత పట్టణం హర్యానా. ఉద్యోగం లేకపోవడంతో నా భార్య రోజూ విసిగిస్తోంది. ఆమె గొడవతో రోజూ ఏగలేపోతున్నా. భార్య నుంచి  విడాకులు ఇప్పించండి. అలాగే గువహటిలో చిక్కుకున్న నన్ను ఢిల్లీ పంపించండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు.

బాధితుడు ట్విట్‌కు స్పందించిన సోనూసుద్‌.. చిన్నచిన్న విషయాలకు భాగస్వామి నుంచి విడిపోవాలని అనుకోవడం సరైనది కాదు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకొండి. మీ భార్యతో కలిసి ఉంటానని మాటిస్తే మీకు తప్పకుండా సహాయం చేస్తాను’ అని బదులిచ్చాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox