Breaking News

విజయ్ మాల్యా రాక మరింత ఆలస్యం ?

10 th Jun 2020, UTC
విజయ్ మాల్యా రాక మరింత ఆలస్యం ?

మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను  భారతదేశానికి రప్పించడం ఇప్పట్లో జరుగుతుందా? అంటే కష్టమే అంటున్నారు న్యాయనిపుణులు.  మాల్యా అప్పగింతకు ముందు చట్టపరమైన సమస్య పరిష్కరించాల్సి ఉందంటూ బ్రిటీష్ హైకమిషన్ ఇప్పటికే  చెప్పగా తాజాగా మరో న్యాయపరమైన చిక్కు వచ్చినట్టు సమాచారం.

మానవతా దృక్పథం ప్రాతిపదికన తనకు లండన్ లో ఆశ్రయం కల్పించాల్సిందిగా మాల్యా కోరినట్టు తెలుస్తోంది. యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్) ఆర్టికల్ 3 ప్రకారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. మాల్యాకు యూకే ఆశ్రయం ఇస్తుందా లేదా అనేది చూడాలి.

అయితే ఇలాటి దరఖాస్తులు ప్రాసెస్ కు కనీసం ఆరు నెలలు పడుతుందనీ, ఒకవేళ మాల్యా అభ్యర్ధనను తిరస్కరించి నప్పటికీ,  దీనిపై మళ్లీ రివ్యూ కోరుకునే అవకాశం కూడా వుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాకు  కొంత సమయం కచ్చితంగా లభిస్తుందని  చెబుతున్నారు.

 భారత్ లో బ్యాంకులకు రూ.9,000 కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో వున్న ఆర్దిక నేరస్తుడిగా మాల్యాను పేర్కొన్న భారత్ తమకు అప్పగించాలని బ్రిటిష్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ భారత్ కు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ న్యాయవ్యవస్దలో వున్న, లొసుగులను ఆసరాగా తీసుకుని మాల్యా తన అప్పగింతను అడ్డుకుంటున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox