ఉత్తరప్రదేశ్ : బీజేపీ ఎమ్మెల్యే జనమేజయ సింగ్ గురువారం రాత్రి మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా సదర్‌కు చెందిన జనమేజయ సింగ్ గుండె పోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధ పడుతున్న ఆయనకు పేస్ మేకర్ ను అమరుస్తున్న సమయం లో గుండెపోటు వచ్చి ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు.సింగ్‌ను తొలుత సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడాయన పరిస్థితి విషమించడంతో లోహియా ఇనిస్టిట్యూట్‌కు తీసుకువెళ్లాల్సి వచ్చింది. జనమేజయ మృతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేశారని యోగి ఆదిత్యనాధ్ కొనియాడారు.