జపాన్ : ప్రధానమంత్రి
షింజో అబే అనారోగ్య సమస్యలతో సోమవారం టోక్యోలోని ఆస్పత్రిలో చేరారు. ప్రధాని అబేకు దాదాపు ఏడున్నర గంటలు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. షింజో అబే అనారోగ్యానికి గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దీనిపై కంగారుపడవలసిన అవసరం లేదని కేవలం జనరల్ చెకప్ కోసం వచ్చినట్లు ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. జపాన్ లో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. ఇంతకుముందు తన మేనమామ ఐసాకు పేరు మీద ఉన్న ఈ రికార్డును అబే సోమవారం అధిగమించారు ఈ మైలురాయిని చేరుకున్న తరువాత అతను రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2007లో ఆరోగ్య సమస్యల వల్ల తన పదవీకి రాజీనామా చేసిన అబే 2012లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అబే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే ఎన్నికల అనంతరం అధికారికంగా మరొకరు ప్రధానమంత్రి అయ్యేవరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు.
మరిన్ని వ్రతాలు చదవండి.