Breaking News

దీపికపై ఎన్సీబీ అధికారుల ప్రశ్నల వర్షం..!

26 th Sep 2020, UTC

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర సీమలో ప్రముఖ నటులు డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణలు నెలకొన్న నేపధ్యంలో ఇటీవలే నార్కోటిక్ అధికారులు దీపికకు, సారా అలీఖాన్ కు, రకుల్, శ్రద్ధాలకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నేడు దీపికాను నార్కోటిక్ అధికారులు విచారిస్తున్నారు. విచారణ నిమిత్తం ముంబై, కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌కు దీపికా తన భర్త తో కలిసి వచ్చింది.

ఆమె ఈ కేసు కు సంబంధించి విచారిస్తున్నారు. ఇది ఇలా ఉంటె సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె కు మానసిక సమస్యలు ఉన్నాయని ఎన్సీబీ విచారణ సమయంలో తాను కూడా దీపికతోనే ఉంటానని రణ్‌వీర్‌ సింగ్‌ నార్కోటిక్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను నార్కోటిక్ అధికారు కొట్టిపడేశారు. దీపికా కుటుంబం నుంచి ఆలాంటి అభ్యర్ధనలు రాలేదని ఆమె కేవలం విచారణ కు హాజరు అవుతున్నట్లు మాత్రమే బదులిచ్చింది అని తెలిపారు.

ఇప్పటికే రకుల్ ప్రీత్‌ సింగ్‌,  కరీష్మా ప్రకాశ్‌ ఎన్సీబీ ఎదుట విచారణకు అయినా సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా వారి నుంచి అధికారులు పలు విషయాలు రాబట్టారు. ఇంకా ఈ కేసు విషయమై సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారిస్తారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox