Breaking News

టాటా గ్రూప్ నుంచి బయటకి వస్తున్న మిస్త్రీ కుటుంబం..!

23 rd Sep 2020, UTC

బిలియనీర్ మిస్త్రీ కుటుంబం టాటా గ్రూప్ అఫ్ కంపెనీస్ నుంచి బయటకు వస్తోంది. ఇప్పటి వరకు మిస్త్రీ కుటుంబం టాటా గ్రూప్స్ లో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్ గా ఉంది. తాజాగా తమకున్న వాటాలను మొత్తాన్ని విక్రయించడానికి మిస్త్రీ కుటుంబం నిర్ణయించుకుంది. మిస్త్రీ కుటుంబం వద్ద ప్రస్తుతం 18 శాతం మేరకు టాటా గ్రూప్ లో వాటాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మిస్త్రీ కుటుంబం వాటాలను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీమ్ కోర్ట్ కు వెల్లడించింది.

మరో వైపు షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ కు కూడా ప్రస్తుతం నిధుల కొరత ఉంది. ఈ పరిస్థితిలో టాటా గ్రూప్ నుంచి బయటకు రావడానికి ఇదే మంచి తరుణం అని మిస్త్రీ ఫామిలీ అనుకుంటోంది. షాపూర్ జీ పల్లోంజీ మిస్త్రీ కుటుంబ నిర్వహణలో ఉన్న కంపెనీలకు ఇపుడు అప్పులను తిరిగి చెల్లించాల్సిన సమయం దగ్గర పడింది. ఈ నేపధ్యంలోనే మిస్త్రీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, ఆస్తుల తనఖా పెట్టడం వంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ, మిస్త్రీ కుటుంబం టాటా గ్రూప్ నుంచి బయటకు రావడాన్ని ఎంచుకుంది. ఈ విషయమై తుది నిర్ణయాన్ని తొందరలోనే మిస్త్రీ కుటుంబ పెద్దలు చెప్పనున్నారు. టాటా గ్రూప్కి, మిస్ట్రీ కుటుంబానికి గత 70 ఏళ్ళుగా వ్యాపార అనుబంధం కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు . చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox