Breaking News

కరోనా కేసుల్లో చైనా ను మహారాష్ట్ర దాటేస్తుంది...!

06 th Jun 2020, UTC

కరోనా వైరస్‌ కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉదృతమవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం వరకు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,642గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి 1,14,073 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం దేశంలో 1,15,942 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

. తాజాగా శనివారం వరకు ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 80వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఈ లెక్కన రానున్న రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర చైనాను దాటేయనుంది. చైనాలో అనధికార లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 84వేలుగా ఉంది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర చైనాను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక దేశవ్యాప్తంగా 6642 మరణాలు చోటుచేసుకోగా ఒక్క మహారాష్ట్రలోనే 2849 మరణాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ ముందువరుసలో ఉన్నాయి.

తమిళనాడులో 28,694 కరోనా కేసులు నమోదవ్వగా, ఢిల్లీలో 26,334, గుజరాత్‌లో 19094 కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోనూ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలో 10వేలకు పైగా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 218గా ఉంది. ఇటు మధ్యప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 8996, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 9773కు చేరింది.ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 4800కు చేరగా, మృతుల సంఖ్య 73కి చేరింది. ఇక తెలంగాణలో శుక్రవారం వరకు 3200లకు పైగా కేసులు నమోదవ్వగా.. 113 మంది మరణించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox