Breaking News

పైనాపిల్ లో బాంబుని పెట్టి..గర్భం తో ఉన్న ఏనుగు ని చంపిన వైనం..!

03 rd Jun 2020, UTC

రాను రాను..మానవత్వం మంటగలుస్తోంది. కొందరు ఆకతాయిలు  ఓ ఏనుగు ను గర్భం తో ఉంది అని కూడా చూడకుండా పైనాపిల్ లో బాంబుని పెట్టి చంపేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఏనుగు ఎవరి కి హాని కలిగించదు. ఊర్లో ఏమైనా ఎవరైనా పెడితే తింటుంది... లేకపోతె దాని తోవన అది పోతుంది. అలాంటి ఏనుగుకు కొందరు ఆకతాయిలు హాని పెట్ట తలచారు.. మలప్పురం జిల్లాలో రోజు వచ్చిన విధంగానే 27వ తేదీన కూడా ఏనుగు వచ్చింది. కాగా గర్భం తో ఉన్న ఏనుగుకు ఆకతాయిలు పైనాపిల్ పండు లో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించారు. అయితే.. తెలియక.. అది తిన్న ఏనుగు ఊరంతా అరుపులు పెడుతూ వెళ్లి కాలవలో దూకింది. గాయాలు కావడంతో అది కాలువలోనే మరణించింది. ఈ విషాదకర సంఘటనను అటవీశాఖ అధికారి మోహన్ క్రిష్ణన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ  ఘటన తాలూకు ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. 
              ఈ ఘటనపై కేరళ పోలీసులు స్పందించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మన్నర్‌క్కడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహన్ కృష్ణన్ ఈ విషయాన్ని ధృవీకరించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఏనుగును పొట్టనపెట్టుకున్నవారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox