Breaking News

5 గంటల విచారణ.. పొంతన లేని సమాధానాలు చెప్పిన దీపికా..!

26 th Sep 2020, UTC

బాలీవుడ్ :డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ నటి దీపికాతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సుమారు 5 గంటల పాటు విచారించారు.అయితే దీపికా ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని, వాటితో నార్కోటిక్ అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీపికా ఉదయం 9 గంటలకు ఎన్సీబీ ఆఫీసుకు వచ్చింది. కాగా అధికారులు ఆమెను పలు కోణాల్లో విచారించారు. అయితే ఆమె దాటవేత సమాధానాలు ఇచ్చారని ప్రాధమికంగా తెలుస్తోంది.

డ్రగ్స్ గురించి తానూ చాట్ చేయడం నిజమేనని, కానీ తానూ డ్రగ్స్ ని వినియోగించలేదని దీపికా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎన్సీబీ ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఈ విషయమై ఆమెను మరోసారి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మరో నటి శ్రద్ధాకపూర్‌ను కూడా ఇవాళ ఎన్సీబీ విచారించింది. ఆమె కూడా తానూ డ్రగ్స్ ను వినియోగించలేదని సమాధానం ఇచ్చింది. సుశాంత్ ఇచ్చిన ఫార్మ్‌హౌజ్ పార్టీకి మాత్రం హాజరైనట్లు ఆమె అంగీకరించింది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునే వాడని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీబీడీ ఆయిల్ గురించి జయషాతో జరిగిన చాటింగ్‌ గురించి మాత్రం ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కాగా ఈ కేసులో ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిప్రసాద్‌ను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox