Breaking News

దీపిక, నమ్రత...దియామీర్జా.. బాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు

22 nd Sep 2020, UTC

బాలీవుడ్‌ :సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తులో బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఎన్ సీబీ రంగంలోకి దిగి రియా చక్రవర్తితో పాటు పలువుర్ని అధికారులు విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాజాగా బాలీవుడ్ లో టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజన్సీ క్వాన్ అధిపతి ధ్రువ్ చిట్ గోపేకర్ ను ఎన్ సీ బీ విచారిస్తోంది. డ్రగ్స్ సరఫరాలో ఇతను కీలకంగా వ్యవహరించాడని భోగట్టా. మరో వైపు మూడేళ్ల కిందట బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే తన మేనేజర్ ను డ్రగ్స్ అడుగుతున్నట్లుగా వాట్సప్ చాట్ బయట పడినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు కూడ డ్రగ్స్ కేసులో బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ససప్లయ్ చేసినట్టుగా విచారణ ఎదుర్కొంటున్న జయసాహా వాజ్ఞ్మూలం ఇచ్చారు. డ్రగ్స్ కేసులో మరో నటి దియా మీర్జా పేరు కూడ  తెరపైకి వచ్చింది. దియా మీర్జాను త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ విచారణలో అంగీకరించినట్లు తెలియవచ్చింది.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో పేరు బయటకు రావడంతో ఆరుగురు నటులు చాలా అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్ సీ బీ తమను విచారణకు పిలిస్తే ఏం చేయాలంటూ తమ న్యాయవాదులను సంప్రదించినట్లు తెలుస్తోంది. 2019లో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ నటులు డ్రగ్స్ వాడినట్లు శిరోమణి అకాలీదళ్నాయకుడు మంజీందర్ సింగ్  ఎన్ సీ బీకి ఇచ్చిన ఫిర్యాదు పైన కూడ దర్యాప్తు జరిగే అవకాశముంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox