Breaking News

బీసీసీఐ లో కాస్ట్ కటింగ్ పై క్లారిటీ..!

07 th Jun 2020, UTC
బీసీసీఐ  లో కాస్ట్ కటింగ్ పై క్లారిటీ..!

కరోనా కారణంగా అన్ని సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. వేల కోట్ల ఆదాయం వుండే  బీసీసీఐ పై కూడా కరోనా కారణంగా ఆర్థిక భారం ఎక్కువైంది. కరోనా కారణంగా జరగాల్సిన సిరీస్‌లన్ని రద్దు కావడం, మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్  నిరవధికంగా వాయిదాపడటంతో బీసీసీఐ కూడా నిధుల కొరతను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ. 4000 కోట్లు నష్టపోనుంది.

 పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం ఎలాంటి కోతలు లేకుండా అందరికి జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది.  ట్రావెల్, వసతులు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం అంతకముందులా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వెల్లడించాడు.  

ఉద్యోగులు, ఆటగాళ్ల జీతాల్లో కోతల గురించి దుమాల్‌ మాట్లాడుతూ, బీసీసీఐ గత ఏడాది అక్టోబరు నుంచే ఖర్చుల్ని తగ్గించుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతానికి ఆటగాళ్లు, ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేయడం కానీ,  కోతలు కానీ లేవు. అయితే ట్రావెల్, వసతుల విషయంలో మాత్రం కాస్ట్ కటింగ్‌ని అమలు చేస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ సీజన్ రద్దయితే మాత్రం ఆ ప్రభావం బీసీసీఐపై తీవ్రంగా పడనుంది.  టోర్నీ రద్దు నిర్ణయాన్ని మాత్రం అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం  అని అరుణ్ వెల్లడించాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox