Breaking News

ఎస్బిఐ ఎండీగా అశ్విని భాటియా...!

01 st Jun 2020, UTC
ఎస్బిఐ ఎండీగా అశ్విని భాటియా...!
ఎస్బిఐ ఎండీగా ఉన్న పీకే గుప్తా మార్చి 31న పదవి విరమణ చేసారు. అయితే.. ప్రస్తుతం ఆయన స్థానం లో తాజాగా అశ్విని భాటియా నియమితులు కానున్నారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తో పాటు.. సెంట్రల్‌ బ్యాంక్‌ ... ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ లకు కూడా కొత్త ఎండి లు రానున్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఎండీగా ఎంవీరావ్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఎండీగా పీపీ సేన్‌గుప్తాల పేర్లను సిఫారసు చేశారు. ఈ మేరకు సోమవారం బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ బ్యాంకులో ఎండి లను నియమించడానికి ఇప్పటివరకు మొత్తం 30 మంది అర్హుల జాబితాను వడపోసిన తర్వాత ముగ్గురి పేర్లను ఫైనలైజ్‌ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అశ్విని భాటియా ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండగా.. కెనరా బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఎంవీ రావ్‌ సేవలందిస్తున్నారు.
              సెంట్రల్‌ బ్యాంక్‌ ఎండి పల్లవ్‌ మహాపాత్ర  వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానం లో సీఎండీగా ఎంవీరావ్ నియమితులు అవుతారు. వీరి నియామకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో చైర్మన్‌, సీఎండీ వంటి అత్యున్నత స్థాయి నియామకాలను జరిపేందుకు ప్రధాని మోదీ 2016లో బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox