Breaking News

రిలయన్స్ కు మరో భారీ డీల్..!

23 rd Sep 2020, UTC
రిలయన్స్ కు మరో భారీ డీల్..!

ముంబై :కరోనా గడ్డు కాలంలో కూడా భారీ విజయాలతో దూసుకుపోయిన రిటైల్ సంస్థ ఏదైనా ఉంది అంటే, అది రిలయన్స్. ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను పలు సంస్థలనుంచి రిలయన్స్ స్వీకరించింది. తాజాగా రిలయన్స్ మరో భారీ డీల్ ను కుదుర్చుకుంది. యూఎస్ కు చెందిన కేకేఆర్ రిలయన్స్ రిటైల్ లో 1.28 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గాను, దాదాపు  రూ. 5,500 కోట్లను కేకేఆర్ ఇన్వెస్ట్ చేయనుంది.

అయితే, రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. రెండు నెలల క్రితం కేకేఆర్ రిలయన్స్ జియోలో రూ. 11,367 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తాజాగా మరోసారి పెట్టుబడులు పెడుతోంది. మరో అమెరికన్ కంపెనీ సిల్వర్ లేక్ సైతం 1.75 శాతం వాటాను రిలయన్స్ రిటైల్ లో కొనుగోలు చేసింది.

దేశంలోనే అతిపెద్ద రిటైల్ సంస్థగా ఎదగాలని రిలయన్స్ భావిస్తోంది. ఈ క్రమంలో పలు కంపెనీలు రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్  లాంటి కంపెనీ లకు గట్టి పోటీ ఇస్తూ, గ్రామీణ ప్రణతాలకు కూడా విస్తరించాడని రిలయన్స్ కృషి చేస్తోంది. కేకేఆర్ పెట్టుబడులను స్వాగతిస్తూ, ఇవి దేశంలోని ప్రతి ఒక్కరికీ రిలయన్స్ రిటైల్ ను దగ్గర చేసేందుకు ఉపయోగపడతాయని అంబానీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల దిశగా రిలయన్స్ ప్రయాణం సాగుతుందని చెప్పుకొచ్చారు. కేకేఆర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సెన్రీ క్రావిస్ కూడా ఈ డీల్ పై స్పందించారు. ఈ డీల్ వలన ఇండియాలో తమ ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox