Site icon Prime9

Solar Electric Car: సరిలేరే నీకెవ్వరు.. 3000 కిమీ మైలేజ్, రూ. 3.25 లక్షలు.. దీన్ని తట్టుకోగలరా..!

Vayve Eva Solar Electric Car

Vayve Eva Solar Electric Car

Solar Electric Car: భారతదేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు కంపెనీలు దేశంలో చాలా తక్కువ బడ్జెట్‌తో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంలో బిజీగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో, వేవ్ మొబిలిటీ ఎవా సోలార్ ఎలక్ట్రిక్ కారును రూ. 3.25 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేశారు. ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారు డిజైన్ కాంపాక్ట్‌గా ఉంటుంది. ఈ కారును సూర్యకాంతి, విద్యుత్ శక్తితో నడపవచ్చు.

 

Vayve Eva Solar Electric Car Price
వాయ్వే ఎవా ఎలక్ట్రిక్ సోలార్ పవర్డ్ కారు ధర రూ. 3.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. బ్యాటరీ రెంట్ ప్రోగ్రామ్ కింద ఈ కారును కొనుగోలు చేస్తే మీకు ఈ కారు రూ. 3.25 లక్షలకు లభిస్తుంది, అయితే మీరు ఈ కారును బ్యాటరీతో పాటు కొనుగోలు చేస్తే, ఈ కారు కొనడానికి రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

 

Vayve Eva Solar Electric Car Range
ఈ విద్యుత్ సోలార్ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అదే సమయంలో ఈ కారును సౌరశక్తిని ఉపయోగించి సంవత్సరంలో 3000 కిమీ వరకు నడపవచ్చు. ఈ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు కిలోమీటరుకు కేవలం 0.50 పైసల ఖర్చుతో నడపగలదని వేవ్ మొబిలిటీ పేర్కొంది. ఇది కేవలం 0.50 పైసలతో ఒక కిలోమీటరు దూరాన్ని కవర్ చేస్తూ, అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది. ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా తనదైన ముద్ర వేయగలదు.

 

Vayve Eva Solar Electric Car Competitors
2025 ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 4.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్ 17.4 కిలోవాట్ బ్యాటరీతో విడుదలైంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. నాణ్యత, ఫిట్, ఫినిష్, రేంజ్ పరంగా, ఈ కారు వాయ్వే ఎవా ఎలక్ట్రిక్ సోలార్ పవర్డ్ కారు కంటే చాలా మెరుగ్గా ఉంది.

Exit mobile version
Skip to toolbar