TVS 2025 Ronin: దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ TVS MotoSoul 4.0లో తన అత్యంత శక్తివంతమైన బైక్ TVS RONIN కొత్త రిఫ్రెష్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ గ్లేసియర్ సిల్వర్. చార్‌కోల్ ఎంబర్ కలర్ ఆప్షన్‌లతో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో కొత్త గ్రాఫిక్స్, కలర్, కొన్ని మార్పులు కూడా చూడచ్చు. ప్రస్తుతం దీనిని ప్రదర్శించారు. ఈ కొత్త RONIN ధర కూడా వచ్చే ఏడాది వెల్లడి కానుంది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు జరగవు. ప్రస్తుత రోనిన్ 225 ధర ఇప్పుడు రూ. 1.35 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కొత్త రోనిన్ 225 గురించి వివరంగా తెలుసుకుందాం.
కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన TVTS కొత్త రిఫ్రెష్ చేసిన Ronin 225 బైక్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. భద్రత కోసం ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS సౌకర్యం ఉంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ ఫీచర్ సహాయంతో బైక్‌కు మెరుగైన బ్రేకింగ్ లభిస్తుంది. సడన్ బ్రేక్‌లు వేసినప్పుడు బైక్ జారిపోదు. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి నేరుగా పోటీ పడనుంది. కాస్మెటిక్ మార్పులు మినహా బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
TVS రోనిన్ 225.9cc, సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 20.1 బిహెచ్‌పి పవర్, 19.93ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. టీవీఎస్ రోనిన్ కర్బ్ వెయిట్ 160 కిలోలు.
రోనిన్ ఇంజన్ అయితే పవర్, టార్క్ పరంగా హంటర్ 350కి గట్టి పోటీనిస్తుంది. మీరు రోనిన్ నుండి మంచి మైలేజీని ఆశించవచ్చు. ఈ బైక్‌లో T- ఆకారపు LED DRL, LED హెడ్‌ల్యాంప్, 2 రైడింగ్ మోడ్‌లు, అడ్జస్ట్ చేసే లివర్, బ్లూటూత్ కనెక్టివిటీ, LCD స్పీడోమీటర్ ఉన్నాయి.
TVS రోనిన్ 225 నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌తో పోటీపడుతుంది. హంటర్ 350 ధర రూ.1,49,900 నుండి ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 349cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 20.2బీహెచ్‌పీ పవర్, 27ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. హంటర్ 350 కర్బ్ బరువు 181 కిలోలు.
TVS రోనిన్ 225 హంటర్ 350 రెండూ గొప్ప బైక్‌లు, రెండూ హైవేపై గొప్ప రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. కానీ TVS రోనిన్ సిటీ రైడింగ్‌లో అత్యుత్తమ బైక్‌గా నిరూపించింది. దాని మెయింట్నెస్, రైడ్ క్వాలిటీ హంటర్ కంటే మెరుగ్గా ఉంది. దాని తక్కువ బరువు కారణంగా, దానిని బ్యాలెన్స్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.