Site icon Prime9

Cheapest Safety SUVs: సేఫ్టీకి మారుపేర్లు.. దేశంలో అత్యంత సురక్షితమైన బడ్జెట్ కార్లు ఇవే..!

Cheapest Safety SUVs

Add a heading

Cheapest Safety SUVs: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి అనేక సరికొత్త వాహనాలు విడుదల అవుతున్నాయి. ప్రభుత్వం పట్టుదలతో కార్ల కంపెనీలు అన్ని వాహనాలకు ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను అందిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, కార్ల బేస్ మోడల్స్‌లో కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ సేఫ్టీ ఫీచర్స్ దృష్ట్యా వాటి ధరలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎస్‌యూవీల యుగం నడుస్తుంది. ప్రజలు హ్యాచ్‌బ్యాక్, సెడాన్‌లకు బదులుగా ఈ విభాగంలో డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. మీరు కూడా ఇటువంటి చవకైన, సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అటువంటి 3 ఉత్తమ ఎంపికల గురించి వివరంగా తెలుసుకుందాం.

Hyundai Exter
హ్యుందాయ్ మోటార్ ఇండియా చౌకైన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ మీకు మంచి ఎంపిక. ఇది డిజైన్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ దీని ఇంటీరియర్, స్పేస్ చాలా బాగుంది. ఎక్స్‌టర్‌లో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.ఈ ఇంజన్ 83పిఎస్ పవర్,114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. ఈ కారు ఒక లీటర్‌లో 19 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ కారు భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ సాధించింది. ఈ వాహనం ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tata Punch
టాటా పంచ్ ఒక మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీ. పంచ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇవజన్ 86పిఎస్ పవర్, 113ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారు ఒక లీటర్‌లో 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం 2 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. పంచ్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ. దీని డిజైన్ ఆకట్టుకోకపోవచ్చు. భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ కూడా సాధించింది. ఈ వాహనం ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Nissan Magnite
నిస్సాన్ మాగ్నైట్ డిజైన్ ఇంప్రెస్ చేసినా ఇంటీరియర్ చాలా బ్యాడ్‌గా ఉంది. మీరు 5 మంది కూర్చునే స్థలాన్ని పొందుతారు. మాగ్నైట్‌లో రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌తో వస్తాయి. కొత్త మాగ్నైట్ మీకు 20kmpl వరకు మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. దీని ధర రూ.6.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Exit mobile version
Skip to toolbar