Site icon Prime9

MG Windsor EV: ఎంజీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. విండ్సర్ ఈవీపై భారీగా వెయిటింగ్ పీరియడ్.. హైదరాబాద్‌లో ఎంతంటే..?

MG Windsor EV

MG Windsor EV

MG Windsor EV: MG విండ్సర్ ఒక ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఈ కారు డిజైన్, ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కారణంగా విండర్స్ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ డెలివరీ గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి నెలా సగటున 3,000 కంటే ఎక్కువ కార్లు విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం కొత్త ఎంజీ విండర్స్ ఈవీకి భారీ డిమాండ్ ఉంది, ఈ మార్చిలో కొంచెం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. కొత్త ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బుక్ చేసుకుంటే డెలివరీకి 1.5 నుండి 2 నెలల సమయం పడుతుంది.

MG Windsor EV Waiting Period
అదేవిధంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో 1 నుంచి 2 నెలల్లోపు కస్టమర్ ఇంటికి కారు చేరుతుంది. వాణిజ్య రాజధాని ముంబైలో 1.5 నుండి 2 నెలలు, ముత్యాల నగరమైన హైదరాబాద్‌లో 2 నెలలు, పూణేలో 2 నెలలు, తీరప్రాంత నగరం చెన్నైలో 2 నెలలు, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 1.5 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

MG Windsor EV Price
దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు ధర కనిష్టంగా రూ.14 లక్షలు, గరిష్టంగా రూ.16 లక్షలు ఎక్స్-షోరూమ్. కారు ఎక్స్‌టీరియర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెర్ల్ వైట్, క్లే బీజ్, స్టార్‌బర్స్ట్ బ్లాక్ వంటి అనేక రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. కారులో 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది పూర్తి ఛార్జింగ్ పై 331 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజీ) ఇస్తుంది. ఇందులో డ్రైవర్ల సౌకర్యార్థం ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.

MG Windsor EV Features
కొత్త ఎంజీ విండ్సర్ ఈవీలో 5-సీట్లు ఉంటాయి. ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు 604 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (15.6-అంగుళాల), పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ కారు దాని భద్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. గరిష్ట భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 ఈవీ, టాటా పంచ్ ఈవీ, కొత్త MG విండ్సర్ EVకి బలమైన పోటీనిస్తాయి.

Exit mobile version
Skip to toolbar