Toyota Rumion: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. నూతన సంవత్సరానికి ముందు మీ కుటుంబానికి విశాలమైన కారు కోసం చూస్తున్నట్లయితే.. మీకో శుభవార్త ఉంది. ఎందుకంటే ఇప్పుడు 7 సీటర్ టయోటా రూమియన్‌పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఎమ్‌విపి పెద్ద కుటుంబానికి పెద్ద ఎంపికగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రూమియన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Toyota Rumion Features
టయోటా రూమియన్ MPV దాని ప్రీమియం ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ఇందులో, మీరు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ AC, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి అనేక కనెక్ట్ చేసిన కార్ ఫీచర్‌లను పొందుతారు.
Toyota Rumion Price
టయోటా రూమియన్ MPV ధర గురించి మాట్లాడితే, బేస్-స్పెక్ S వేరియంట్ ధర రూ. 10.44 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ V వేరియంట్ ధర రూ. 13.73 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది.
Toyota Rumion Powertrain
టయోటా రూమియన్‌లో పెట్రోల్, CNG ఇంజన్‌లు అందించారు. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంది. అయితే, CNG ఇంధనంతో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందించారు.
Toyota Rumion Safety
టయోటా రూమియన్ టాప్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూమియన్ సీట్ బెల్ట్ రిమైండర్, హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, పిల్లలకు ప్రత్యేక సీటుతో స్టాండర్డ్‌గా వస్తుంది.
Toyota Rumion Mileage
కొత్త టొయోటా రూమియన్ మైలేజీ గురించి మాట్లాడితే దాని పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 20.11 కిమీ, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 20.51 కిమీ, సిఎన్‌జి ఇంధనంతో కిలోకు 26.11 కిమీ మైలేజీని ఇస్తుంది.
టయోటా రూమియన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్ స్క్రీన్, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు, కీలెస్ ఎంట్రీ వంటి అధునాతన ఫీచర్‌లను అందిస్తుంది.
టయోటా రూమియన్ మిడ్-స్పెక్ G వేరియంట్‌కు భారతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. దీని ధర దాదాపు రూ.11.60 లక్షలు. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లతో పాటు మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో అందించారు.
మారుతి సుజుకి ఎర్టిగా రీబ్యాడ్జ్డ్ మోడల్‌గా టయోటా రూమియన్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే, మారుతి సుజుకి ఎర్టిగాను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. రెండు MPVలు సౌకర్యవంతమైన సీటింగ్, మృదువైన డ్రైవింగ్, మంచి భద్రతను అందిస్తాయి.