Site icon Prime9

Tata Harrier EV: ఎలక్ట్రిక్‌గా వస్తున్న మీకు ఇష్టమైన కారు..త్వరలో హారియర్ ఈవీ.. టాటాను ఆపలేరు..!

Tata Harrier EV

Tata Harrier EV

Tata Harrier EV: ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో టాటా మోటర్స్ హారియర్ ఈవీ ప్రొడక్షన్ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ మోడల్‌కు ఎక్స్‌పోలో మంచి ఆదరణ లభించింది. కంపెనీ వచ్చే నెలలో హారియర్ ఈవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మోడల్ మార్చి 31న మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వాహనంలో అనేక గొప్ప ఫీచర్స్ ఉంటాయి.

Tata Harrier EV Highlights
హారియర్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈవీలో 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లను కారులో చూడచ్చు.

Tata Harrier EV Battery And Range
టాటా హారియర్ ఈవీలో 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. అలానే డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ 500 ఎన్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని టాటా ధృవీకరించింది. ఈ వాహనం పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ధర గురించి చెప్పాలంటే.. హారియర్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

Tata Harrier EV Features And Specifications
కొత్త హారియర్ ఎలక్ట్రిక్‌ని D8 ప్లాట్‌ఫామ్‌పై బిల్డ్ చేశారు. ఇది ఇప్పటివరకు JLR కూడా ఉపయోగించని ప్రత్యేక ప్లాట్‌ఫామ్. హారియర్ ఎలక్ట్రిక్‌లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కనిపించబోతున్నాయి. ఈ వాహనంలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, డ్రైవర్ వైపు మెమరీ ఫంక్షన్ , ప్యాసింజర్ వైపు 4-వే పవర్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఎంజీ, హ్యుందాయ్ కూడా ఈవీ విభాగంలో తమ పట్టును బలోపేతం చేయడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు టాటా నుండి కొత్త హారియర్ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో బలమైన పోటి ఇవ్వచ్చు. మరికొద్ది రోజుల్లో దీని టీజర్,ఇతర సమాచారం కూడా చూడవచ్చని భావిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar