Site icon Prime9

Tata Sumo And Nano Launch Soon: చూసుకుందాం రండి.. మళ్లీ వచ్చేస్తున్న టాటా సుమో, నానో.. నామ్‌ చోటా హై.. లేకిన్‌ సౌండ్‌ బడా హై..!

Tata Sumo And Nano Launch Soon

Tata Sumo And Nano Launch Soon

Tata Sumo And Nano Launch Soon: టాటా మోటర్స్ ఒక ప్రసిద్ధ స్వదేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థ. దేశీయ రహదారులపై సంవత్సరాల క్రితం కంపెనీ సుమో, నానో కార్లు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా పేద-పేద మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అవి కూడా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. అయితే పలు కారణాలతో సుమో, నానో కార్ల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రెండు కార్లు మళ్లీ కొత్త రూపంలో లాంచ్ కానున్నాయని తరచూ పుకార్లు వస్తున్నాయి. ఈ సుమో, నానో కార్లను ప్రవేశపెట్టిన తర్వాత వాటి అంచనా ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Tata Sumo
ముందుగా టాటా సుమో ఎంపీవీ గురించి మాట్లాడుకుందాం. ఈ కారును రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. 7 లేదా 9 సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, కొత్త సుమో ఎమ్‌పివి విడుదలకు సంబంధించి టాటా మోటార్స్ నుండి అధికారిక వివరాలు అందుబాటులో లేవు.

కొత్త టాటా సుమో రెండు పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోలు, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండవచ్చని చెబుతున్నారు. ఇది సగటున 18 నుండి 20 kmpl మైలేజీని అందజేస్తుందని అంచనా. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Tata Nano
టాటా నానో కూడా కొత్త రూపంలో లాంచ్ అవుతుందనే ఊహాగానాలు మీడియాలో కొన్నిసార్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ కారు 3 నుండి 4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల కావచ్చని చెబుతున్నారు. ఇందులో 4 సీట్ల ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. కొత్త టాటా నానోలో హై కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుందని చెబుతున్నారు. ఇది గరిష్ఠ హార్స్ పవర్, న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.

ఈ కొత్త నానో 30 kmpl మైలేజీని అందిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నానో కారు ఎక్ట్సీరియర్‌లో మరింత అధునాతన డిజైన్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తుంది. కొత్త రంగుతోనూ దొరుకుతుందని అంటున్నారు. దీనితో పాటు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ కండిషన్, మ్యూజిక్ సిస్టమ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar