Tata Sierra: టాటా మోటార్స్ తన కొత్త సియెర్రాను భారత్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా మరోసారి ఇది టెస్టింగ్‌లో కనిపించింది. కానీ ఈ ఎస్‌యూవీని ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటిసారి ప్రదర్శించారు. టాటా Gen2 EV ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే ఎస్‌యూవీ వచ్చే నెల (ఏప్రిల్ 2025) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వాహనం ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ కోసం సిద్ధంగా ఉంది.
టాటా మోటార్స్ వాహనాలు భద్రత విషయంలో ఎవరికీ తక్కువ కాదు. టాటా వాహనాలు తమ సత్తాను నిరూపించుకున్నాయి. భద్రత కోసం కొత్త సియెర్రాలో 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లను అందించవచ్చు.
డ్రైవర్ కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ సైడ్ టచ్‌స్క్రీన్‌తో సహా 3 స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. అన్ని స్క్రీన్‌లు 12.3 అంగుళాలు ఉండచ్చు. అత్యంత సౌకర్యవంతమైన సీట్లు ఈ వాహనంలో ఉన్నాయి. ఇది కాకుండా, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లను ఇందులో చూడచ్చు.
పవర్ కోసం రాబోయే సియెర్రాలో 170హెచ్‌పి పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఇది కాకుండా, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంటుంది. సియెర్రా 6 మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఎస్‌యూవీ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది భారతదేశంలో రూ. 10.50 లక్షల ప్రారంభ ధరతో విడుదల కావచ్చు.