Site icon Prime9

Tata Sierra Launching: షోరూమ్‌ల ముందు జనాల జాతరే.. సియెర్రా మళ్లీ వచ్చేస్తోంది.. ఈ సారి కార్ మార్కెట్లో ఊచకోతే!

Tata Sierra

Tata Sierra

Tata Sierra Launching in June to the India Market: భారతదేశం టాటా మోటార్స్ నుంచి వచ్చే కొత్త సియెర్రా రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ వాహనాన్ని ఈ సంవత్సరం ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించారు. నివేదికల ప్రకారం కంపెనీ దీనిపై వేగంగా పని చేస్తోంది. కొత్త సియెర్రా దేశంలో ఈవీ, పెట్రోల్, డీజిల్ వేరియంట్స్‌లో వస్తుంది. టాటా జెన్2 ఈవీ ప్లాట్‌ఫామ్‌పై తయారుచేస్తుంది. తాజా నివేదికల ప్రకారం, దాని రాకలో కొంత ఆలస్యం కావచ్చు. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణం గురించి సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కొత్త సియెర్రా ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Tata Sierra Launch Date
ఈ ఏడాది మే-జూన్‌లో కొత్త టాటా సియెర్రాను విడుదల చేయవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ తర్వాత దీనిని మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. కొత్త సియెర్రాలో మొదటిసారిగా అనేక మంచి, ఉపయోగకరమైన ఫీచర్లను అందించవచ్చు. దీనిలో వినియోగదారులు ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి ఉంటాయి.

 

Tata Sierra Engine
కొత్త టాటా సియెర్రాలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 170హెచ్‌పి పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. సియెర్రా 6 మాన్యువల్ , ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఎస్‌‌యూవీ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో కూడా లభిస్తుంది. దీనిని భారతదేశంలో రూ. 10.50 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేయచ్చు. ఈ కారు కోసం భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Tata Sierra Safety Features
భద్రత కోసం, కొత్త సియెర్రాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్ 2 అడాస్ వంటి ఫీచర్లను అందించవచ్చు. ఇది కాకుండా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ సైడ్ టచ్‌స్క్రీన్ వంటి 3 స్క్రీన్‌లు ఇందులో కనిపిస్తాయి. అన్ని స్క్రీన్లు 12.3 అంగుళాలు ఉండవచ్చు. ఈ కారులో కొత్తగా ఏదైనా కనిపిస్తుందో లేదో చూడాలి.

 

 

 

Exit mobile version
Skip to toolbar