Tata Altroz stock Clear Discount: మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20లకు గట్టి పోటీని ఇచ్చేందుకు టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా, కొంతకాలం క్రితం కంపెనీ తన రేసర్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. కానీ ఈ కారు అమ్మకాల పరంగా విజయం సాధించలేకపోయింది. ఆల్ట్రోజ్ ఎక్స్-షో రూమ్ ధర రూ. 6,64 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ నెలలో రేసర్ ఎడిషన్‌ను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దీనిపై ఉన్న డీల్స్ మిస్ చేయకండి.
టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ అమ్మకాలను పెంచడానికి, స్టాక్‌ను క్లియర్ చేయడానికి (MY24) రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపులో రూ. 85000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నాయి. ఈ తగ్గింపు పాత మోడల్‌పై ఉంది, ప్రస్తుతం కొత్త మోడల్‌పై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంజన్ గురించి మాట్లాడితే.. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్,డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటో (DCA) ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఒక లీటర్‌లో 18 నుండి 25 కిమీ/లీ మైలేజీని ఇవ్వగలదు.
కస్టమర్లను ఆకర్షించడానికి, ఈ కారు రేసర్ ఎడిషన్ కూడా మార్కెట్లో విడుదలైంది, ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బో ఛార్జ్డ్ ఇంజన్ 120 PS పవర్, 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఇందులో 16 అంగుళాల టైర్లు ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ డిజైన్ దాని అతిపెద్ద బలహీనమైన అంశం. ఇండియన్స్ అలాంటి డిజైన్లను ఇష్టపడరు. అలాంటి డిజైన్ ఉన్న కార్లకు ఫ్యామిలీ క్లాస్ దూరంగా ఉంటుంది. అయితే ఈ కారులో స్థల కొరత లేదు. క్వాలిటీ పరంగా కూడా దీన్ని బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు.