Site icon Prime9

Tata Motors Discounts: కార్ కొనాలంటే ఇదే టైం.. ఈ ఏడు కార్లపై రూ.1.5 లక్షల డిస్కౌంట్.. త్వరపడండి..!

Tata Motors Discounts

Tata Motors Discounts

Tata Motors Discounts: భారతదేశంలోని ప్రముఖ కార్ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్, ఏప్రిల్ 2025‌లో తన అనేక కార్లపై గొప్ప తగ్గింపులు, ఆఫర్‌లను ప్రకటించింది. కంపెనీ అందించే డిస్కౌంట్‌లలో యూజర్ల డిస్కౌంట్, స్క్రాపేజ్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి. టాటా మోటార్స్ MY24 మోడల్స్‌పై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఏప్రిల్ 2025 నెలలో కస్టమర్లకు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఏప్రిల్ 2025లో టాటా మోటార్స్ కార్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది.

 

Tata Punch
టాటా మోటార్స్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే. ఏప్రిల్‌లో టాటా పంచ్‌పై అతి తక్కువ తగ్గింపు లభిస్తుంది. MY24 మోడల్స్, MY25 మోడల్స్ అన్ని వేరియంట్లపై రూ.25,000 వరకు తగ్గింపు ఇస్తుంది.

 

Tata Curvv
టాటా మోటార్స్ తన కొత్త ఎస్‌యూవీ టాటా కర్వ్ MY24 మోడల్‌పై తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ తన MY24 మోడల్‌పై రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. వినియోగదారులకు మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై ఎలాంటి స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వడం లేదు.

 

Tata Tiago
టాటా మోటార్స్ అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ టియాగో‌కి ఇటీవల మిడ్-లైఫ్ అప్‌డేట్ అందించారు. దీని పాత మోడల్‌పై రూ.35,000 వరకు తగ్గింపు ఇస్తోంది. దాని MY25 వేరియంట్‌పై రూ. 25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దాని బేస్ XE వేరియంట్‌పై ఎటువంటి తగ్గింపు ఇవ్వడంలేదు.

 

Tata Tiago
టియాగో, టిగోర్ రెండూ ఏకకాలంలో మిడ్-లైఫ్ అప్‌డేట్ పొందాయి. దీని పాత వేరియంట్ రూ. 45,000 వరకు తగ్గింపును పొందుతోంది, ఇందులో రూ. 30,000 వినియోగదారు తగ్గింపు, రూ. 15,000 వరకు స్క్రాపేజ్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. దాని MY25 వేరియంట్‌పై రూ. 30,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు.

 

Tata Nexon
టాటా మోటార్స్ తన నెక్సాన్‌పై రూ.45,000 వరకు తగ్గింపును అందిస్తోంది. దాని MY24 మోడల్స్ అన్ని ఇంజన్ ఆప్షన్‌లపై రూ. 5,000 వినియోగదారు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ అందిస్తుంది. దాని MY25 వేరియంట్‌లపై కేవలం రూ. 15,000 తగ్గింపు అందుబాటులో ఉంది.

 

Tata Harrier and Tata Safari
హారియర్,సఫారీ టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు. ఏప్రిల్ 2025లో వీటిపై రూ.75,000 వరకు తగ్గింపును అందజేస్తున్నారు. ఈ తగ్గింపు 2024 మోడల్‌పై ఇస్తుండగా, 2025 మోడల్‌‌పై రూ.50,000 తగ్గింపు లభిస్తోంది.

 

Tata Altroz
టాటా మోటార్స్ ఏప్రిల్ 2025లో ఆల్ట్రోజ్‌పై అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. దాని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్‌ల MY24 మోడల్‌లపై రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. దాని ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌పై రూ. 1.35 లక్షల వరకు తగ్గింపు, వేరియంట్‌లపై రూ. 45,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar