Tata Curvv CNG Variation Launching Soon: టాటా కర్వ్ సీఎన్‌జీ ఇండియాలో లాంచ్ కానుంది. ఇటీవల ఇది టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని ఆధారంగా ఈ కారు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించి మార్కెట్లో నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కారు టెస్టింగ్ చాలా కాలంగా జరగుతోంది. ఇటీవలే పూణేలో ఈ కారును టెస్ట్ చేశారు. ఇది దాని సీఎన్‌జీ వేరియట్‌ను నిర్ధారిస్తుంది. టాటా కర్వ్ అమ్మకాలు దేశంలో అంతగా బాగాలేవు. అందుకే కంపెనీ సీఎన్‌జీ ఆధారంగా విక్రయాలు పెంచాలని భావిస్తోంది. టాటా కర్వ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? దాని ధర ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం.
Tata Curvv CNG Price
టాటా కర్వ్ సీఎన్‌జీ భారతదేశంలో ఈ సంవత్సరం మే-జూన్ నాటికి లేదా సంవత్సరం చివరి నాటికి ప్రారంభించవచ్చు. ఈ వాహనం ధర దాదాపు రూ.10 లక్షలు ఉండవచ్చని అంచనా. దీనిపై ఇంకా కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు.
Tata Curvv CNG Features
టాటా కర్వ్ సీఎన్‌జీ ఎక్ట్సీరియర్ డిజైన్, ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. కర్వ్ సీఎన్‌జీలో ఒక్కొక్కటి 30 లీటర్లు (60 లీటర్లు) రెండు సీఎన్‌జీ ట్యాంకులు కూడా ఉంటాయి. సీఎన్‌జీ ట్యాంక్ తర్వాత కూడా, దాని బూట్‌లో స్థలానికి కొరత ఉండదు. ట్విన్ సీఎన్‌జీ సిలిండర్ టెక్నాలజీ ఉన్న ఇతర టాటా కార్లలో స్పేస్ సమస్య లేదు. విశేషమేమిటంటే.. టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో సీఎన్‌జీ కిట్‌ను అందించిన భారతదేశపు మొట్టమొదటి సీఎన్‌జీ కారు ఇదే.
టాటా కర్వ్ సీఎన్‌జీలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అయితే సీఎన్‌జీ మోడ్‌లో పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో కొన్ని మార్పులు చేయచ్చు. ఇదే ఇంజన్ నెక్సాన్ సీఎన్‌జీకి కూడా శక్తినిస్తుంది. టాటా కర్వ్ సీఎన్‌జీలో భద్రతా ఫీచర్ల కొరత ఉండదు. క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ పొందింది.
ఫీచర్ల గురించి చెప్పాలంటే.. 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కర్వ్‌లో ఇవ్వవచ్చు. ఇది కాకుండా ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం, కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఉన్నాయి.