Site icon Prime9

Maruti Suzuki Swift Special Edition: స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్.. ఆకట్టుకుంటున్న రంగులు.. అదిరిపోయే ఫీచర్లు..!

Maruti Suzuki Swift Special Edition

Maruti Suzuki Swift Special Edition

Maruti Suzuki Swift Special Edition: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి సుజుకి స్విఫ్ట్. స్విఫ్ట్ కారు 4వ తరం ప్రస్తుతం అనేక మార్కెట్లలో అమ్ముడవుతోంది. స్విఫ్ట్ 3వ తరం మోడల్ ఇప్పటికీ థాయ్‌లాండ్‌ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇప్పుడు, సుజుకి మోటార్ థాయ్‌లాండ్‌లో స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ సుజుకి స్విఫ్ట్ కారు ప్రారంభ ధర 567,000 THB. ఇది భారత కరెన్సీలో రూ.14 లక్షలు.

సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ అని పిలవబడే ఇంపాక్ట్ ఛాలెంజర్ ముయాంగ్ థాంగ్ థానిలో జరిగిన మోటార్ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించింది. ఇది 29 నవంబర్ నుండి 10 డిసెంబర్ 2024 మధ్య ప్రదర్శించింది. సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ ప్రధాన ఆకర్షణ దాని ఆకర్షణీయమైన గ్రేడియంట్ కలర్.

సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ మోడల్ ముందు భాగంలో పింక్-ఇష్ పర్పుల్ షేడ్, వెనుకవైపు బ్లూ కలర్ కలదు. ఇది అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ కారు స్పోర్టినెస్, క్యారెక్టర్‌ని జోడించే వైట్, రెడ్, బ్లాక్ చారలతో చూడవచ్చు. అలాగే, ఈ స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ కారులో నలుపు రంగులలో స్పోర్టినెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ అల్లాయ్ వీల్స్ ఆఫ్టర్ మార్కెట్‌గా కనిపిస్తాయి.  ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ మార్పులన్నీ కాకుండా, సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో విక్రయిస్తున్న 3వ తరం స్విఫ్ట్‌తో సమానంగా ఉంటుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ మోడల్ 1.2 లీటర్ K12M 4-సిలిండర్ నేచురల్ గా ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో ఆధారితమైనది. ఈ ఇంజన్ 83 పిఎస్ పీక్ టార్క్, 108 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ CVT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇతర సుజుకి వాహనాలతో కనిపించే అదే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఛాసిస్.

భారతదేశంలో సేల్స్‌లో ఉన్నస్విఫ్ట్ డిజైన్ కారు గురించి మాట్లాడినట్లయితే.. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో ఉత్తమమైనది. మారుతి స్విఫ్ట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ, ఏబీఎస్, హిల్-హోల్డ్ కంట్రోల్, ఈఎస్‌సీ, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లతో భద్రత పరంగా కూడా అత్యాధునికమైనది.

ఇప్పుడు సుజుకి కంపెనీ మాతృభూమి జపాన్‌లో కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది. కొత్త సుజుకి స్విఫ్ట్ రివైజ్డ్ స్టైలింగ్, కొత్త ఇంజన్ ఆప్షన్‌లతో పాటు అప్‌డేట్ చేసిన ఇంటీరియర్‌లతో వస్తుంది. 2024 మారుతి స్విఫ్ట్ భారత మార్కెట్లో విడుదల కానుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ గుజరాత్‌లోని సుజుకి హన్సల్‌పూర్ యూనిట్‌లో తయారు చేస్తున్నారు.

Exit mobile version