Site icon Prime9

Suzuki E Access: ఓలా రన్ అవుట్.. కొత్త సుజికి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. !

Suzuki E Access

Suzuki E Access

Suzuki E Access: సుజికి మోటర్ ఇండియా ఈ సంవత్సరం భారత్ ఆటో ఎక్స్‌పో 2025లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ యాక్సెస్‌ని పరిచయం చేసింది. దీని ప్రీమియం డిజైన్ కారణంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఆ సమయంలో ఈ స్కూటర్ ధరను కంపెనీ వెల్లడించలేదు. ఇప్పుడు కంపెనీ ఈ నెలలో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్కూటర్ నేరుగా హోండా ఎలక్ట్రిక్ యాక్టివా, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌లతో పోటీపడుతుంది. ఈ క్రమంలో స్కూటర్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

 

సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.1kW ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఈ మోటారు 15ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. ఇందులో 3.07కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో కూడా ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 95కిమీల పరిధిని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 71 కిమీ. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి ఈ-యాక్సెస్‌ను 0 నుండి 100శాతం వరకు ఛార్జ్ చేయడానికి 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జ్ చేయ చ్చు.

 

సుజుకి ఈ యాక్సెస్ స్కూటర్‌ను మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో కొనుగోలు చేయచ్చు, ఇందులో మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం. 2/మెటాలిక్ మాట్ బోర్డియక్స్ రెడ్, పెరల్ గ్రేస్ వైట్/మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే,పెరల్ జేడ్ గ్రీన్/మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. యువతకు నచ్చే విధంగా దీని డిజైన్ స్మార్ట్‌గా ఉంటుంది. స్కూటర్ సీటు సౌకర్యవంతంగా ఉంటుంది.

 

ఫీచర్ల విషయానికి వస్తే స్కూటర్‌లో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, దీనిలో ఓడోమీటర్, రేంజ్, బ్యాటరీ, ట్రిప్‌మీటర్, ఇతర ప్రాథమిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్‌లలో టర్న్-బై-టర్న్ నావిగేషన్, ట్రాఫిక్ అప్‌డేట్‌లు ఉన్నాయి. ఈ యాక్సెస్‌కు ఎకో, రైడ్ ఏ, రైడ్ బీ అనే మూడు రైడ్ మోడ్‌లు ఇచ్చారు. ఇందులో ఫోబ్ కూడా ఉంది. దీనిలో స్కూటర్‌ను రిమోట్‌గా లాక్/అన్‌లాక్ చేయొచ్చు. అలానే టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్‌తో అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని సీటు ఎత్తు 765మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165మిమీ, కర్బ్ వెయిట్ 122కెజీ. ఈ స్కూట ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Exit mobile version
Skip to toolbar